Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను మంచోడ్ని కాదు... కోహ్లీని హెచ్చరించిన డివిలియర్స్

భారత్ తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాభవం మూటగట్టుకున్న సఫారీలు బెంగళూరులో జరిగే రెండో టెస్టును ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో, అవసరమైతే స్లెడ్జింగ్ చేయడానికి కూడా తాము వెనుకాడమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ హెచ్చరికలు జారీ చేశాడు. ఫీల్డ్ లో ఉన్నప్పుడు తాను మంచోడిని కాదని... విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడి ఏకాగ్రతను భగ్నం చేయడానికి అవసరమైతే స్లెడ్జింగ్ చేయడానికి కూడా వెనుకాడనని స్పష్టం చేశాడు. తనకు గెలవడమే ముఖ్యమని... దానికోసం ఏమైనా చేస్తానని సఫారీ కెప్టెన్ చెప్పాడు. కోహ్లీ టెక్నిక్, చిన్న లోపాలను గురించి కామెంట్ చేస్తూ అతడి ఏకాగ్రతను దెబ్బతీస్తానని చెప్పాడు. ఇదంతా ఆటలో భాగమేనని... గ్రౌండ్ బయట తాను చాలా మంచి వ్యక్తినని తెలిపాడు. మరోవైపు, డివిలియర్స్ రేపు తన 100వ టెస్ట్ ఆడుతున్నాడు. దీనిపై అతను స్పందిస్తూ, ఇంత స్థాయికి ఎదుగుతానని, 100వ టెస్ట్ ఆడుతానని తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పాడు. ఇదెంతో గర్వంగా ఉందని తెలిపాడు. 99 టెస్టుల్లో డివిలియర్స్ 7,685 పరుగులు చేశాడు.

More Telugu News